భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
28-04-2025
చండ్రుగొండ:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ:
అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని టి డబ్ల్యూ జె ఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్) రాష్ట్ర కార్యదర్శి కె. అనిల్ రెడ్డి ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. సోమవారం చండ్రుగొండ మండల కేంద్రంలో అన్నపరెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే నెలలో జరగనున్న టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా మహాసభలకు జర్నలిస్టులను సిద్ధం చేసేందుకు సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. అలాగే, ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు మరియు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామిశెట్టి సైదయ్య, సంఘం సభ్యులు నేరెళ్లకుంట సుధాకర్ రావు, కుంజా వెంకటేష్, బొగ్గుల శివ నాగిరెడ్డి, ఎస్.కె. జాఫర్, ఆకుల శివ, వీర రాఘవ, రమేష్, రబ్బాని, ఎండి పాషా, తాళ్లూరి రామదాసు, ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి: కె. అనిల్ రెడ్డి
RELATED ARTICLES