TEJA NEWS TV HEADLINES :
▪️నేడు శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం, బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన. మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20 వేలు పంపిణీ కార్యక్రమం.. 1,29,178 మందికి లబ్ధి.
▪️ఉగ్రవాదంపై పోరుకు మీకు తోడుగా ఉంటాం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు సంఘీభావం.
▪️గత ప్రభుత్వంలో షిరిడీ సాయి ఎలెక్ట్రికల్స్ కు కేటాయించిన భూములపై సమగ్ర విచారణ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం.
▪️స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 1121.20 కోట్లు విడుదల.
▪️రాష్ట్రంలో 73 మందికి ఎంపిడివోలుగా పదోన్నతులు.. ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీ రాజ్ కమిషనర్ క్రిష్ణతేజ.
▪️కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన దుడ్డు గణేష్ శర్మ ఎంపిక. ఈనెల 30న విజయేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా సన్యాసదీక్ష.
▪️ మే నెల ఆఖరు లోగా టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తాం. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో స్పష్టం.
▪️ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 25 పడకల తలసేమియా సెంటర్ ప్రారంభం.
▪️పాక్ పౌరులకు 14 రకాల వీసాలు రద్దు. వారిని గుర్తించి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం.
▪️బ్యాంక్ ఖాతాకు 4 గురు నామినీలు పెట్టుకోవచ్చు.. మ్యూచువల్ ఫండ్, డిమ్యాట్, బీమాలకు 3 గురు నామినీలు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు ఆమోదం.. నోటిఫికేషన్ జారీ.
▪️అమెరికా వైట్ హౌస్ సైబర్ సెక్యూరిటీ భద్రతా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గా కోనసీమ, కేసనకుర్రు గ్రామ వాసి గొట్టుముక్కల మధు నియామకం.
నేటి వార్తల ముఖ్యాంశాలు
RELATED ARTICLES