
తేజ న్యూస్ టివి, ప్రతినిధి
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కొత్తగూడెం ప్రధానోపాధ్యాయులు ఎమ్, సుధాకర్ కుమార్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి రాము, మరియు గ్రామ మాజీ సర్పంచ్ వాసం సాంబయ్య పాల్గొని గ్రామంలోని పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తుల ను కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల గురించి వివరించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉమా రాణి మరియు త్యాగరాజు ఏఏపీసీ చైర్మన్ అనూష , అంగన్వాడీ టీచర్ సవిత గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.