Saturday, April 26, 2025

నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96 ఫిర్యాదులు

TEJA NEWS TV :నంద్యాల జిల్లా
21-04-2025


పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 96 ఫిర్యాదులు…

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

జిల్లా ఎస్పీ. శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS


నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 21-04-2025) నిర్వహించిన  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)  కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు ఫిర్యాదిదారుల నుంచి 96 ఫిర్యాదులను స్వీకరించారు.


ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో  సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి.

*ఫిర్యాదులలో కొన్ని….*

1) రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో సర్వే నంబర్ 757/3 లో ఫిర్యాదికి 3.50 సెంట్ల భూమికలదు. సదరు భూమి రుద్రవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి s/o నారాయణ రెడ్డికి కౌలుకు ఇవ్వడం జరిగింది. కౌలు అడిగితే పొలం దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని నాకు న్యాయం చేయండని పేరూరు గ్రామానికి చెందిన T. ఎల్లమ్మ జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు.

2) 2022 సంవత్సరంలో పెద్ద మాతంగి రవికుమార్ s/o పెద్ద మాతంగి సాయిబాబా అను వ్యక్తికి రెండు లక్షలు తన కుటుంబ అవసరాల నిమిత్తం అప్పు ఇచ్చాను. అప్పటినుండి అసలు ఇవ్వకుండా వడ్డీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, పైగా ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడు.నాకు న్యాయం చేయండని బొంతలవీధిలో నివాసముంటున్న M.జయమ్మ జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు.

3) నాకు నంద్యాల టౌన్ జెండా వీధికి చెందిన కరిముల్లా అతని స్నేహితుడు రసూల్ ఇద్దరు కలిసి 2023 వ సంవత్సరంలో 1,22,200/-రూపాయలకు అగ్రిమెంట్ వ్రాయించుకొని బుల్లెట్ వాహనం అమ్మడం జరిగింది.సదరు వాహనానికి 04 కంతులు పెండింగ్ ఉన్నాయని చెప్పినారు వాటిని నేను కట్టాను.కానీ HDFC బ్యాంకులో 08 కంతులు పెండింగ్ ఉన్నాయని బ్యాంకు ఫైనాన్స్ వారు తీసుకుని వెళ్లడం జరిగింది. పై ఇద్దరు వ్యక్తులు ఫైనాన్స్ వల్ల వద్ద నుండి బుల్లెట్ బండి విడిపిస్తానని చెప్పి వేరే వాళ్లకు దానిని అమ్మడం జరిగింది. ఇప్పుడు వాళ్లు డబ్బులు ఇవ్వకుండా బుల్లెట్ బండి ఇవ్వకుండా నన్ను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండని నంద్యాల టౌన్ కు చెందిన షేక్. నాజూ హుస్సేన్ జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్  ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు గారు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular