
TEJA NEWS TV
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ,జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ నియోజకవర్గ కోఆర్డినేటర్ కూచన రవళి పాల్గొన్నారు.ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడి సత్యం అహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని అందరిచే ప్రతిజ్ఞ చేశారు. ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరిస్తున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రావుల శ్రీనివాస్, మండల,గ్రామ, నాయకులు ,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.