
TEJA NEWS TV
రుద్రవరం మండల కేంద్రం లోని పొలిమేరలో వెలసిన శ్రీ ఎల్లమ్మ దేవత అమ్మవారు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా పాత గుడి నూతన హంగులతో ముస్తాబు చేయడం జరిగింది. నూతన విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆదివారం కావడంతో భక్తుల పూజలు అందుకోవటం కోసం శనివారం నాడు ముస్తాబు చేయడం జరిగిందని భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోవటానికి అనుగుణంగా సౌకర్యవంతంగా నూతన విశ్వావసు నామ సంవత్సర ప్రారంభానికి ఆహ్వానం పలుకుతూ ఎల్లమ్మ తల్లి పూజలకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్మాణ కర్తలు కమతం తాటిరెడ్డి వీరి కుమారుడు రామచంద్రారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.