యన్టీఆర్ జిల్లా నందిగామ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం మధిర రోడ్డు లో గల యమ్.ఆర్.ఆర్. కళాశాల లో శనివారం చైర్మన్ భాను చందర్ వారి ఆధ్వర్యం లో సీనియర్ సివిల్ కోర్టు జడ్జి యస్.కె. రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇటీవల కాలం లో ఎక్కువగా జరుగుతున్న మోటార్ వాహనాలు, ర్యాగింగ్, ఆన్లైన్ సైబర్ మోసాలు, మహిళల పై వేధింపులు, డ్రగ్స్ , నార్కోటిక్స్ చట్టాలు వాటికి సంబంధించిన సెక్షన్లు తదితర విషయాల పై యువత కు అవగాహన కల్పించారు. అధ్యాపక బృందంతో కలిసి ఛైర్మన్ భానుచందర్ సివిల్ కోర్టు జడ్జి యస్ .కె. రియాజ్ వారిని శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోషియేషన్ అధ్యక్షులు యన్. విధ్యాసాగర్, బార్ సెక్రెటరీ మణిబాబు, సీనియర్ లాయర్ కొమ్మినేని మౌళేశ్వ రరావు, ప్రిన్సిపాల్ మాధవి, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
యమ్.ఆర్.ఆర్. కళాశాల లో విద్యార్థిని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన
RELATED ARTICLES