బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో గోదావరి నదీతీరాన కొలువైన శ్రీశ్రీశ్రీ సంతాన వేణుగోపాలస్వామి | తిరుకల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
వేదపండితులు,అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12.06 గంటలకు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
తాళ్లూరి రాజాశ్రీకృష్ణ-గాయత్రీ, తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతుల సౌజన్యంతో నిర్వహించిన కల్యాణంలో తాళ్లూరి జయ శేఖర్, నీలిమ, దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు స్వర్ణ కిరీటాలు బహుకరించారు.
తాళ్లూరి ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్యతో పాటు ఎన్నారైలు డాక్టర్. అనితారాణి-గొట్టిపాటి ప్రవీణ్కుమార్, ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ- విజయ రేణుక, దంపతులు, కుటుంబసభ్యులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించగా అర్చకులు వైభవంగా ఈ కల్యాణాన్ని నిర్వహించారు.
కల్యాణం అనంతరం స్వామివారికి తాళ్లూరి కుటుంబీకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణానికి వచ్చిన భక్తులకు భారీగా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ సర్పంచ్ కొర్సా లక్ష్మి, తాళ్లూరి రాధాకృష్ణ, తాళ్లూరి రమేష్, చేకూరి ప్రసాద్, మదపాటి ప్రకాష్, మోహనరావు, భక్తులు తరలివచ్చారు…
ఘనంగా శ్రీసంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణం
RELATED ARTICLES