TEJA NEWS TV
*చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు ల పెళ్లిరోజు సందర్భంగా బహుకారణ
*పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు*
*దాతృత్వం చాటి ప్రజల దాహార్తి కోసం చేగుంట మండల రెవెన్యూ ఆఫీస్ లో వాటర్ డిస్పెన్సరి ని చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు లు గురువారం బహుకరించారు. ఆ ఆది దంపతులకు ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ధన్యవాదములతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాన ధర్మాలు దాతృత్వాన్ని పెంపొందించి, సమాజానికి మేలు చేస్తాయాన్నారు. ప్రతి నిత్యం ప్రజలు రెవెన్యూ కార్యాలయానికి వస్తున్న వారికే గాకుండా దాహార్తి*
*అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా సహాయం చేసిన స్వర్ణలత భాగ్య రాజ్ ల పెళ్లిరోజు తీపి గుర్తుగా ఏర్పాటు చేశారు. దాతృత్వ ద్వారా సమాజానికి సహాయపడటం ద్వారా దాన ధర్మాలు చేయవచ్చు అనే దానికి చక్కటి తార్కాణం అని అన్నారు. అందరూ చేస్తారు కానీ స్వర్ణలత భాగ్య రాజ్ లు* *కలకాలం గుర్తుండేలా చలి కాలం లో వేడి నీరు, ఎండా కాలంలో చల్ల నీరు వచ్చే డిస్పెన్సెర్ యంత్రాన్ని బహుకరించిన అందరి మనసులు హృదయాలు దోచుకున్నారు.*
*దాన ధర్మాలు చేయడం ద్వారా పుణ్యాలు లభిస్తాయనే సత్ సంకల్పంతో ఈ మంచి సేవలు అందించే గొప్ప మనసున్న మంచి మనసులు అని వారి సేవలను కొనియాడారు. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి అని ఆలోచించకుండా సమాజానికి మేలు చేస్తుంది అనే విశ్వాసం తో నమ్మకంతో చేసిన గొప్ప పని అన్నారు.*
*దానం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరతాయి, మనశ్శాంతి లభిస్తుందనే సదుద్దేశ్యంతో సేవా చేసి తరించాడని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్.రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై భారత్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దివ్యశ్రీ. సర్వేర్ రవీందర్.శ్రావణ్.రాజేష్. ప్రవీణ్.గాంధీరాజ్.రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.*
ప్రజల దాహార్తి కోసం చేగుంట మండల రెవెన్యూ ఆఫీస్ లో వాటర్ డిస్పెన్సరి ఏర్పాటు
RELATED ARTICLES