TEJA NEWS TV
సమగ్ర శిక్షా లో విధులు నిర్వహిస్తున్న మెదక్ జిల్లా చెగుంట మండలం లో CRPsగా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్ లు కొద్ది రోజుల క్రితం 14-02-2025 న రోడ్డు ప్రమాదం లో కన్ను మూశారు. ఇద్దరి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ఉద్యోగులు మరియు వివిధ మండలాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ముందుకు వచ్చి 12,00,000/- (పన్నెండు లక్షల రూపాయలు సేకరించారు).
ఈ సేకరించిన ఆర్థిక సహాయన్ని రమేష్ & శ్రీనివాస్ పిల్లల పేర్ల మీద సుకన్య సమృద్ధి అకౌంట్ లో, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ లో మరియు కొంత నగదు రూపేణా మరియు కిరాణం సరుకులు అందించారు.
దానికి సంబంధించిన పత్రాలను ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు అందించారు.
వాస్తవానికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చెయ్యాలి.
కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేనందున ఉద్యోగులే తలా ఇన్ని డబ్బులు జమ చేసి ఆర్థిక సహాయం చేశారు.
ఇకమీదట ప్రభుత్వమే ఎక్సగ్రెషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్, జిల్లా కోఆర్డినేటర్స్ జ్యోతి & సుదర్శన్ మూర్తి, చేగుంట MEO నీరజ తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేషాద్రి, మెదక్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు,తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, కోశాధికారి బొజ్జ సంపత్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షలు దత్తు, మెదక్ జిల్లా CRP అధ్యక్షులు గట్టయ్య, MIS జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా నాయకులు పులి రమేష్, సంతోష్ రెడ్డి, శ0కర్, ప్రతాప్, ప్రవీణ్, బాలగౌడ్, వినోద, మహేష్, నవీన పాల్గొన్నారు.
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఇరువురికి 12,00,000/- (పన్నెండు లక్షలు) అర్థిక సహాయం
RELATED ARTICLES