డోన్ ఫిబ్రవరి 14 తేజ న్యూస్ టీవీ
గ్రామీణ ప్రాంతాల లో పాకి పని చేసే కార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వాలని ఆర్మీ విజయ భాస్కర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన
గురువారం ప్యాపిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ శ్రీనివాసులు కు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకోట విజయభాస్కర్ మాట్లాడుతూ ప్యాపిలి మండల పరిధిలో గ్రామీణ ప్రాంతాలలో పాకి పని చేస్తున్నటువంటి కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వాలి ఎందుకంటే ఎటువంటి గ్రామ ప్రజలు మురికి కాలువల నుండి వివిధ చెత్త చెడు పదార్థాలను అన్ని కూడా వారు శుభ్రంగా ఉండే విధంగా పనిచేస్తున్న కార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం వెంగళంపల్లి గ్రామంలో సంవత్సరం పాటు పనిచేస్తే కేవలం రెండు మూడు నెలలకు మాత్రమే జీతాలు ఇస్తూ మిగతా నెలలకు ఇవ్వకుండా ఈ ఈ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పంచాయతీ సెక్రెటరీ సుబ్బమ్మపైన శాఖ పరమైన చర్యలు తీసుకుని విచారణ చేసి ఆమెను విధుల నుండి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రతి గ్రామంలో ఉండే కార్మికుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రామాంజనేయులు సుధాకర్ సురేష్ లు పాల్గొన్నారు.…
కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పంచాయతీ సెక్రెటరీ పై చర్యలు తీసుకోవాలి… విజయ భాస్కర్
RELATED ARTICLES