Thursday, March 13, 2025

భూమి గల ప్రతి రైతు ప్రభుత్వం తీసుకొచ్చిన విశిష్ట గుర్తింపు సంఖ్యను తప్పక నామోదు చేసుకోండి…. ఏ.ఓ.రాజేష్

ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందెందుకు ప్రతి రైతు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా మండల వ్యవసాయశాఖ అధికారి రాజేష్ తెలిపారు.
మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భూమి గల
ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యన పొందడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరంతో పరదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.ఇది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయశాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమమన్నారు. రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియలో ముఖ్యాంశాలురైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య కీలకమన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారికగుర్తింపుగా పనిచేస్తుందన్నారు. రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్ట సంఖ్య అర్హులైన భూమిగల రైతులు గుర్తించడంలో తోడ్పడంతో వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు నిరవధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుందన్నారు. భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల భీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, సూక్ష్మసేద్యంపై రాయితీ,పంట రుణాలు, పెట్టుబడి సాయం, తదితర పథకాలు నేరుగా పొందే వీలు కలుగుతుందన్నారు. సత్వరపరిహారం అందుటకు ఉపయోగపడుతుందన్నారు. నీటిపారుదల, తెగుళ్ళ నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి తోడ్పడుతుందన్నారు. గ్రామంలో గల రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి, రైతు గుర్తింపు సంఖ్య పొందవచ్చన్నారు. ప్రస్తుతం భూమి గల ప్రతి రైతుకు, మున్ముందు కౌలు రైతులకు, భూములేని వ్యవసాయ కూలీలు, ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఉన్న వారికి ఇది వర్తిస్తుందన్నారు. నమోదు కోసం రైతులు వారి ఆధార్ నెంబర్, ఆధార్ అనుసంధారిక ఫోన్ నెంబర్,భూమి రికార్డుల వివరములు (పట్టాదారు పాస్ బుక్) తీసుకొని గ్రామంలో రైతు సేవా సిబ్బందిని కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా  తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular