డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ కాలానికి చెందిన దాసరి రవి గుండె జబ్బుతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడాని తెలుసున్న మాజీ శాసన సభ్యులు కోట్ల సుజాతమ్మ అతనిని హైద్రాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు.
ఈ విషయం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన వైద్యానికి అయిన బిల్లులను సీఎం సహాయ నిధికి పంపించారు.
బుధవారం సీఎం సహాయనిధి కింద విడుదలైన 3,50,000/-రూపాయల చెక్కును బాధితునికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు బాగులేని యెడల ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్నట్లయితే వారి కుటుంబానికి ఆసుపత్రి తరపున ఎంత ఖర్చు అయితే అంత ఖర్చును సీఎం సహాయ నిధి కింద విడుదల చేయడం జరుగుతుందని దీనిని డోన్ నియోజకవర్గ ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
3,50,000/- వేల సిఎం సహాయనిధి చెక్కును అందజేసిన మాజీ శాసన సభ్యులు కోట్ల సుజాతమ్మ
RELATED ARTICLES