


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
తేదీ: 10.02.2025
బీజేపీ బీజేఎంసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాయ కళాక్షేత్రంలో నంది అవార్డు మరియు డా. ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు ప్రదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా 150 మందికి పైగా నంది అవార్డులు మరియు డా. ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డులు తెలుగు కళా రత్నాల సాంసృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అందజేయబడ్డాయి.
అలాగే, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన బీజేపీ బీజేఎంసీ టీమ్, సాంసృతిక సేవా కళాకారులు, ఇతర ప్రముఖులకు కూడా ఈ సందర్భంగా అవార్డులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, గౌరవరపు జగదీష్, డేవిడ్ రాజు, చేను శివశంకర్, ముక్తి మల్లేష్, కిన్నెర రామకృష్ణ, పుట్టబంతి హరిబాబు, రాజులపాటి ఐలయ్య, పొనక రాందాస్, కోడెం సీతాకుమారి, ఎండీ రంజన్ అలీ, కుదురుపాక నిర్మల, భూక్యా రవి తదితరులు పాల్గొన్నారు.