భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
7-2-2025
ఈ సమావేశంలో బీజేపీ బీజేఎంసీ (భారతీయ జనతా మజ్దూర్ సెల్) తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు బానోత్ హుస్సేన్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల సమస్యల గురించి చర్చించారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో పక్కా ఇళ్ల నిర్మాణం, మంచినీటి సదుపాయం, సీసీ రోడ్లు, అంగన్వాడీ స్కూళ్లు, పోడు భూములకు పట్టాలు వంటి సమస్యలపై మెమోరాండం సమర్పించారు.
కార్మికుల సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని హుస్సేన్ నాయక్‌ను బీజేపీ బీజేఎంసీ నాయకులు కోరారు. ఈ సమావేశంలో బీజేపీ బీజేఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిశెట్టి సామేలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, పుట్టబంతి హరిబాబు, ఇతర నాయకులు బానోత్ శ్రీను నాయక్, కొట్టే కృష్ణ, ఈదుల్ల రవి, పొణక రామదాస్, పూనెం సూరయ్య, సమ్మక్క, రాజులపాటి ఐలయ్య, ధనసరి సారమ్మ తదితరులు పాల్గొన్నారు.
హుస్సేన్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి బిజె ఎం సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామ్యేల్
RELATED ARTICLES