Wednesday, February 5, 2025

ఐ ఏ ఎల్ టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా జడ్జ్ పాటిల్ వసంత్

భద్రాద్రి కొత్తగూడెం : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ మరియు ప్యాకెట్ క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బుధవారం లైబ్రేరియన్ హాల్లో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు రోజువారి తమ విధులను నిర్వహించుకునేందుకు అనుగుణంగా ఉందన్నారు. కోర్టు రోజువారి పని దినాలు, పండుగలు సెలవు  మొదలైన వివరాలతో సమగ్రంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో రూపొందించటమ్ అభినందనీయమని అన్నారు. ఈ 2025 వ సంవత్సరంలో మీకు ,మాకు, మనందరికీ మంచి జరగాలని తద్వారా న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగేటట్లుగా మన పని విధానం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఐ ఏ ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కరరావు మాట్లాడుతూ న్యాయవాదులు క్రమశిక్షణ, విలువలతో కూడిన పని విధానాన్ని అలవర్చుకొని బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పని చేసుకోవాలని ఆయన అన్నారు .ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో జిల్లా న్యాయ సేవ అధికారి భానుమతి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ బి రామారావు ,ఒకటవ ,రెండవ అదన పు జూనియర్ న్యాయమూర్తులు సుచరిత, సాయి శ్రీ, భద్రాచలం న్యాయమూర్తి శివ నాయక్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, ఊట్కూరి పురుషోత్తం ,పుల్లయ్య, సుధాకర్, ఐఏఎల్ రాష్ట్ర నాయకులు బాగా మాధవరావు ,మునిగడప వెంకటేశ్వర్లు ,ఉప్పు శెట్టి సునీల్ ,మనుబోతుల సత్యనారాయణ, జియా హుల్ హసన్ ,యాస మౌనిక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సందు హు ప్రవీణ్ సాదిక్ పాషా  ప్రతిభ దూదిపాల రవికుమార్  సీనియర్ , జూనియర్ న్యాయవాదులు పీపీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular