TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన వాలంటీర్లు మేము గత ప్రభుత్వంలో సచివాలయాలలో వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేసే వారిమని మాకు అప్పట్లో 5000 రూపాయల గౌరవవేతనం ఇచ్చేవారని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాలంటీర్లను తమ వృత్తిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మీడియా ద్వారా తెలిపారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం
గత వైసిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఆ సచివాలయాలలో వాలంటీర్లను ఎంపిక చేసి వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసి ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేసే విధంగా వారికి 5000 రూపాయల గౌరవ వేతనంతో వాలంటరీ వ్యవస్థను నెలకొల్పారు.
కానీ 2024 ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసివేయకుండా కొనసాగిస్తూ వారికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని మా ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచుతామని వారి ద్వారా ప్రజలకు సేవ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాలంటీర్లకు హామీ ఇచ్చారని
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీరి వ్యవస్థను పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారని దీని ద్వారా ఎంతోమంది వాలంటీర్లు తమ జీవనాధారం కోల్పోయారని ఇకనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణంఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను తిరిగి వారి విధులలోనికి తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లు కొల్లాయి,శేఖర్,మంజుల,జయశ్రీ, హైమావతి,బాలకృష్ణ,ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీని సిఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి – డోన్ వాలంటీర్లు
RELATED ARTICLES