Wednesday, February 5, 2025

గురుకులాల ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్…సాయి ఎక్స్ల్ లెంట్ ఆధ్వర్యంలో శిక్షణకు సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ

జూలూరుపాడు మండలం కేంద్రంలో ఉన్న
  ” సాయి ఎక్సలెంట్ స్కూల్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ఎంట్రన్స్ పరీక్షకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్, ప్రకటనలో తెలియజేశారు. 2024- 25 సంవత్సరాలకు4,5,6,7,8  తరగతులకు తాను సాయి ఎక్సలెంట్ స్కూల్లో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు, గతంలో సాయి ఎక్స్ల్లెంట్ స్కూల్ శిక్షణ ద్వారా ఎంతో మంది విద్యార్థులను గురుకుల, నవోదయ ,ఏకలవ్య పాఠశాలకు పంపి విజయం సాధించామని అన్నారు. గురుకులాల్లో ఐదవ తరగతి పరీక్షల ప్రవేశానకై23-2-25న పరీక్ష జరుగుతుందని పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు ప్రభుత్వం ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో జరుగుతుందని. గురుకులాల్లో సీటు కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకుని 21 -12- 2024 నుండి 1-2-2025 వరకు ఆన్లైన్లో 100 రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ఫోన్ నెంబర్ తో పాటు దరఖాస్తు మాత్రమే చేయాలనే,నీబందన ఉందన్నారు ,విద్యార్థులకు సాయి ఎక్సలెంట్ స్కూల్లో జనవరి 18 తారీకు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని. ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించిన వారికి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించనున్నట్లు ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం సాయి ఎక్సలెంట్ స్కూల్ 9441700094  మరియు 9440296832 కు కాల్ చేసి మరిన్ని వివరాలను పొందవచ్చు అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular