TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం రాజనగరం గ్రామంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం హాస్పిటల్ బృందంతో ఏర్పాటుచేసిన మెగా మెడికల్ క్యాంప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు మాట్లాడుతూ ఈ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఈ ఏరియాలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం అని చెప్పి ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసిన తానా అధ్యక్షుడు శృంగారపు నిరంజన్ కి ధన్యవాదాలు తెలియజేశారు…
నేను ఎలక్షన్లో క్యాంపెనింగ్ తిరిగేటప్పుడు ప్రతి ఒక ఇంటికి వెళ్లడం జరిగింది అక్కడ ఎవరో ఒకరు హెల్త్ ప్రాబ్లం తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గ్రామస్థాయిలో కూడా ఇలాంటి మంచి మెడికల్ క్యాంపు పెట్టి ప్రజల కు ఉచితంగా సేవ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది…
గతంలో నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులకు ఫ్రీగా వైద్యం చేపించుకోవడానికి వేల మందికి లెటర్లు ఇవ్వడం జరిగింది…
ఇప్పటి కాలంలో చిన్న వయసు వారికే మోకాళ్ళ నొప్పులు జబ్బులు రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం మనం త్రాగే నీరు మనం తినే ఫుడ్ వాళ్ళ వస్తున్నాయి అప్పట్లో చాలా వరకు మంచి ఫుడ్ మంచి నీరు తీసుకునే వాళ్ళు కనుక ఇప్పటి ఈ ఊరిలో చాలా మంది పెద్ద వయసు వారు కనపడుతున్నారు…
అందుకోసమని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్గానిక్ పంటలనే పండించాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్గానిక్ వస్తువులతో పండించే పంటల కు సిటీలో మంచి డిమాండ్ ఉంది…
బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను నేను చెక్ చేయడం జరిగింది మనకు క్యాన్సర్ ఉందా లేదా అనేది చెక్ చేసిన కొద్ది నిమిషాలలోనే తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా క్యాన్సర్ సూచనలు ఉంటే వెంటనే హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది….
ఈ క్యాన్సర్ స్క్రానింగ్ ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాలు దాటిన వారు చెక్ చేపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనందరి కోసం ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసారు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్న…
వచ్చే తరాల వారికి ఈ క్యాన్సర్ జబ్బు లేకుండా చూసుకోవాడానికి ఏమి చేయాలనేది కూడా నేను ఆలోచిస్తున్నాను కచ్చితంగా ఈ క్యాన్సర్ నిర్మూలనకు పోరాడుతానని చెప్తున్నాను….
శిరివెళ్ల : మెగా మెడికల్ క్యాంప్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
RELATED ARTICLES