చంద్రుగొండ మండల పరిధిలోని ముస్లిం మైనార్టీ వర్గాల్లోని పేద మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అందించబడుతున్నాయని జిల్లా మైనార్టీ సంఘం అధ్యక్షులు సయ్యద్ బాదుషా, పేర్కొన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు డిసెంబర్ 31 లోపు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. వయస్సు 18 నుండి 55 ఏళ్ల ఉండాలి కనీస విద్యార్హత:5. తరగతి. గుర్తింపు పత్రాలు ఆధార్ కార్డు: ఓటర్ ఐడి. ఆదాయం కనీసం 1.50 లక్షల లోపు పట్టణ ప్రాంతాల్లో 2. లక్షల లోపు తెల్ల రేషన్ కార్డు . విడాకులు పొందిన మహిళలకు, వితంతువులకు, అనాధలకు, ఒంటరి మహిళలకు,తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తరువాత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హార్డ్ కాపీ నీ స్థానిక మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించవలసిన ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన, పార్సి, వర్గాలకు చెందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ మహిళా శక్తి పథకానికి మైనార్టీ మహిళలు దరఖాస్తు చేసుకోండి
RELATED ARTICLES