TEJA NEWS TV ALLAGADDA
రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన బాబుసా (50) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. కర్నూలు నుండి కడప వైపు వెళుతున్న కారు చాగలమర్రి వైపు మోటార్ సైకిల్ పై వెళుతున్న బాబు సా ను వెనుక వైపు నుండి ఢీకొనడంతో అతను సంఘటన స్థలం లోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.