TEJA NEWS TV ALLAGADDA
రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్: ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని ఆదివారం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో మఠం అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలను దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి, వేద పండితుల బృందం ఆయనకు రంగమంటపంలో వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ రాక సందర్భంగా ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అహోబిలం మఠం అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.