TEJA NEWS TV DHONE
ఆలయ అభివృద్ధి కొరకు 1,11,111/- రూపాయల విరాళం అందించిన భక్తుడు
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామాన వెలిసిన లక్షణాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటి నరసింహస్వామిని శనివారం ఆధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకున్నారని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉప కమిషనర్ ఎం రామాంజనేయులు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాలు ప్రకారం 07-12-2024 నాడు స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో హాజరై అభిషేకాలు గండ దీపాలు,పుట్టు వెంట్రుకలు,తలనానిలలు వంటి మొక్కలు భక్తులు చెల్లించుకున్నారని తద్వారా దేవస్థానమునకు స్వామివారి సేవ టికెట్లు,లడ్డు ప్రసాదం,కేశఖండనం, రూము బాడుగలు విరాళాలు మొదలగు వాటి ద్వారా 4,44,309-(అక్షరాల నాలుగు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయల) ఆదాయం వచ్చింది అని తెలిపారు.
ఆలయ అభివృద్ధికి విరాళం……..
తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన క్రీ!!శే!! ఎన్.శాంతన్న గారి భార్య క్రీ!! శే!!ఎన్. మల్లమ్మ గారి మనవడు ఎన్.నవీన్ కుమార్ వారి జ్ఞాపకార్థంగా ఆలయ అభివృద్ధికి 1,11,111/-రూపాయలు సమర్పించినట్లు ఆలయ కార్య నిర్వాహక అధికారి ఉప కమిషనర్ ఎం.రామచంద్రుడు తెలిపారు.
డోన్: 4,44,309/- రూపాయల కానుకలు సమర్పించిన మద్దిలేటి స్వామి భక్తులు
RELATED ARTICLES