ఏలూరు పట్టణం నుండి ప్రకాశం జిల్లా పరిధి వరకు ESI చందా చెల్లింపు చేయు కార్మికులకు, వారి పైన ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న విజయవాడ గుణదల ESI ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా నందిగామ వాసి పూజారి రాజేష్ ను ఎన్నిక చేసినట్లుగా హాస్పిటల్ బోర్డు చైర్మన్ మరియు సూపరింటెండెంట్ Dr.V. జ్యోతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూజారి రాజేష్ దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలకు కార్మిక చట్టాల విభాగం మేనేజర్ గా కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు. గడచిన 13 సంవత్సరాలలో ఇరు తెలుగు రాష్ట్రాలలో వేల మంది ESI కార్మికులకు వైద్య రీత్యా , ESI నుండి కార్మికులకు వచ్చు వివిధ ప్రయోజనాలను అందివ్వడం లో, అవగాహన సదస్సులు ఆరోగ్య క్యాంపులు నిర్వహణ గావించి కార్మిక పక్షపాతిగా పేరుగాంచారు. ఆయన కృషికి ఫలితంగా ఎంపిక చేసినట్లు సమాచారం…..
విజయవాడ ESI హాస్పిటల్ బోర్డు మెంబర్ గా పూజారి రాజేష్
RELATED ARTICLES