TEJA NEWS TV :
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని యం.బి చర్చి దగ్గర ఎస్సీ కాలనీలో నివాసముంటున్న మణిక్యమ్మ అలియాస్ బుల్లెమ్మ అనే మహిళ శనివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందింది.వివరాల్లోకి వెళితే మాణిక్యమ్మ కొన్ని సంవత్సరాల క్రితం లలితా మహిళా సంఘంలో కార్యకర్తగా పాల్గొనే వారు ఈ విషయం తెలుసుకున్న శ్రీ భీమా లలితా మహిళ వెల్ఫైర్ సొసైటీ సంఘం నాయకురాలు అయిన కదిరికోట పద్మవతి (పద్మక్క) గారు మృతురాలి ఇంటి దగ్గరకు వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు,ఈ విషయాన్ని వైసీపీ యువ నాయకులు వై.ధరణి ధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి తెలుపగా ఆయన ఆదేశాల మేరకు మృతురాలి మట్టి ఖర్చులకు గాను వారి కుటుంబానికి 10,000 పదివేల రూపాయలను అందించడం జరిగింది.ఈ సందర్భంగా కదిరికోట పద్మక్క మాట్లాడుతూ బుల్లెమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు కదిరికోట పద్మక్క,మరియమ్మ, మా వారధి న్యూస్ పేపర్ సబ్ ఎడిటర్ కదిరికోట రాజు, అబ్రాహాము తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ యువ నాయకులు వై.ధరణి ధర్ రెడ్డి ఆదేశాల మేరకు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
RELATED ARTICLES