Thursday, February 6, 2025

రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో లీగల్ అవగాహన సదస్సు

TEJA NEWS TV

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు లీగల్ చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక ప్రారంభించారు. ఈ సదస్సులో ఏటూర్ నాగారానికి  చెందిన ప్రముఖ అడ్వకేట్ శ్రీ వైద్యుల వెంకటేశ్వర్లు హాజరయ్యారు, వారు మాట్లాడుతూ విద్యార్థులు పలు శాఖలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా న్యాయ చట్టాల పై అవగాహన ఈ రోజుల్లో ఎంతో అవసరం అని  తెలిపారు, ప్రతి ఒక్కరికి  చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ప్రతి రంగంలోనూ రాణించవచ్చు అని  నవ భారతం నిర్మాణానికి చట్టాలు  ఎంతో అవసరమని ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
  ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సంధానకర్త సిహెచ్ వెంకటయ్య, జ్యోతి(IQAC),  కనీస్ ఫాతిమా, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి కే. రమేష్, జీవ వేణి, సంపత్, తదితర అధ్యాపక బృందం  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular