Wednesday, February 5, 2025

అన్నపురెడ్డిపల్లి: ఘనంగా ముగిసిన రాజ్య స్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
20-11-2024


అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం

అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల & జూనియర్ కళాశాల విక్రమ్ అంబలాల్ సారాబాయి ప్రాంగణంలో ఈనెల 18 నుంచి మూడురోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే
*జారె ఆదినారాయణ*  ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతి విభాగాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి వసతులు కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలలనుంచి వచ్చిన సుమారు 4000 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో దాదాపుగా 900 పైగా ప్రాజెక్ట్ లను విద్యార్థులు ప్రదర్శించగా సీనియర్, జూనియర్, ఐటీడీఏ విభాగాలుగా విభజించి న్యాయనిర్ణేతలు ఉత్తమ ప్రాజెక్ట్లను ఆవిష్కరించిన 48 మంది విద్యార్థులును ఎంపిక చేసి ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ , ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలతో పాటు ప్రభుత్వ మెమంటోలు అందించి విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు.
ఈ సదస్సులో జిల్లానుంచి ఆరుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాబడటంతో  ప్రత్యేకంగా అభినందించింది మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ఎస్పీ రోహిత్ రాజ్ , విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి , జిల్లా సైన్స్ అధికారి చలపతి రాజు, సోషల్ వెల్ఫేర్ గురుకులాల జోనల్ అధికారిణి స్వరూప రాణి,  విద్యాశాఖ డైరెక్టర్, పలువురు అధికారులు,  ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య , రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు , పలువురు ప్రముఖులతో పాటు, అన్నపురెడ్డిపల్లి,  అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి నాయకులు నాగ సీతారాములు, స్థానిక నాయకులు పర్ష వెంకట్, రమణ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular