TEJA NEWS TV
ప్రైవేటు మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్న ప్రజలు…..
*అల్పపీడన ప్రభావంతో మారిన వాతావరణం….*
*సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్న వైనం*…
*కచ్చితంగా ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నా చిన్నపిల్లల వైద్యుడు చంద్రన్..*
గత నాలుగైదు రోజులుగా అల్పపీడన ప్రభావంతో వాతావరణం ఉన్నటువంటి మారిపోవడంతో గాలు నీరు కరిషితం అవడంతో విష జ్వరాల బారిన పడుతున్న ప్రజలు…. సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి మరియు ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్న జ్వర పీడితులు…..
వరదయ్యపాలెం మండలంలో కూడా ఇదే పరిస్థితి కానీ మండలంలో రెండు ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రిలో కే జ్వరాల బారిన పడ్డవారు వెళుతున్నారని సమాచారం….
ఈ సందర్భంగా సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రి చిన్న పిల్లల డాక్టర్ చంద్రన్ మాట్లాడుతూ వాతావరణం మార్పుల వలన జ్వరాలు వస్తున్నాయని ఆసుపత్రికి చాలామంది జ్వరాల బారిన పడి వస్తున్నారని కచ్చితంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు మహిళలు వృద్ధులకు వేడి ఆహారం వేడి నీళ్లు కచ్చితంగా తాగించాలని…. వేడి దుస్తులు ధరించాలని…. దగ్గు జలుబు తీవ్ర జ్వరం ఉన్నవారికి కాస్త దూరంగా ఉండాలని ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్దులు…. వ్యాధి ముదిరే వరకు చూడకుండా వెంటనే వైద్యం చేపించుకోవాలని…. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని తెలిపారు….
వరదయ్యపాలెం: గ్రామీణ ప్రాంతాలలో వైరల్ ఫీవర్ పంజా
RELATED ARTICLES