మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి మళ్లీ వరద వచ్చింది. సోమవారం ప్రకాశం బ్యారేజీకీ 45వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు బ్యారేజ్ ఏఈ దినేశ్ తెలిపారు. అదే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లి తహశీల్దార్ ఒక ప్రకటనలో కోరారు. మత్స్యకారులు నదిలోకి చేపల వేటకు వెళ్లొదన్నారు.
కృష్ణా నదికి మళ్లీ వరద హెచ్చరిక
RELATED ARTICLES