కర్నూలు జిల్లా. ఆలూరు తాలుక్. హొళగుంద మండల కేంద్రంలోని దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు సంబంధించి ప్రజలలో అవగాహన కలిగించడానికి ఈరోజు సాయంత్రం హోలగుంద మండలం, సులువాయి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ డి.ఎస్.పి.శ్రీ బి వెంకట రామయ్య విచ్చేసి బన్నీ ఉత్సవం గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, ఎవరు కూడా ఇనుప రింగులు తొడిగిన కర్రలను దేవరగట్టుకు తీసుకురాకూడదని, నిప్పు రింగులను జనాలపైన విసరకూడదని అలా చేసిన వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
ఈ కార్యక్రమమునకు ఆలూరు సర్కిల్ CI శ్రీ శ్రీనివాస నాయక్ , హొళగుంద పిఎస్ SI బాల నరసింహులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగినది.
సులువాయి గ్రామంలో అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES