ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామంలో గ్రామ నాయకుల సహకారంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆయుష్) అనిగండ్లపాడు వారి సౌజన్యంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్. రత్న ప్రియదర్శిని 50 మంది వివిధ రకాల రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు లగడపాటి మోహనరావు, డాక్టర్. రత్న ప్రియదర్శిని ,కంపౌండర్ శైలజ, కృష్ణవేణి, శ్రీజ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.*
శివాపురం గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
RELATED ARTICLES