వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో శనివారం సాయంత్రం ఆరేపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో కృష్ణ నది దగ్గర కొంతమంది వ్యక్తులు కోడిపందాలు ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్సై నరేందర్ మరియు వారి సిబ్బంది యుగంధర్ ,వెంకటన్న గౌడ్, బాలరాజు, ఏఎస్ఐ బీచూపల్లి తో కలిసి ఆకస్మికంగా కోడిపందాల స్థావరంపై దాడులు చేసి 12 మంది వ్యక్తులను, 10 బైకులు, 9 సెల్ ఫోన్లు, 11.590/-రూపాయలను మరియు (08) కోడిపుంజులను స్వాధీనం చేసుకొని పై వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైనా కోడిపందాలు కానీ, పేకాట కానీ, అక్రమ ఇసుక రవాణా కానీ, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా కానీ చేసినట్లయితే వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా పోలీసు వారు హెచ్చరించడం జరిగింది.
కోళ్ల పందేలు స్థావరాలపై పోలీసుల దాడి
RELATED ARTICLES