దళితులకు డబ్బులు పంచమని మొత్తం ఇచ్చాను.
మండల నాయకులే మింగేసారు అంటూ ఫైర్.
అవసరమైతే వెంకటాపురం మండలం వచ్చి నిరూపించుకుంటా.
సంచలనంగా మారిన పోదేo వీరయ్య మాటలు.
ఇవేమీ పట్టనట్టు కాంగ్రెస్ పార్టీ చిన్నోడు దళిత బంధు విషయం బట్ట బయలు చేసిన తేజ న్యూస్ రిపోర్టర్ పై అక్రమ కేసులు బనాయింపు.
వాళ్ల అక్రమాలకు అభం శుభం తెలియని సూరవీడు గిరిజన మహిళను లాగుతున్న వైనం.
గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టుగా కమిటీ సభ్యులు సైతం తేజ న్యూస్ పత్రికా విలేకరిపై అక్రమ కేసులు పెట్టినట్టు ఆరోపణలు.
అక్రమ కేసులో నిజం ఎంత?.
బూటకపు కేసు అయితే పెట్టిన కమిటీ సభ్యుల మీద పెట్టించిన చిన్నోడు మీద కేసులు అవుతాయా?.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని దళిత బంద్ పేరిట లక్షల రూపాయలు దండుకున్న మండల కాంగ్రెస్ నాయకులు అంటూ వెలువడిన తేజ న్యూస్ కథనానికి భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య స్పందించారు. తన పైన వెంకటాపురం మండలంలో దుష్ప్రచారం జరుగుతోంది అని దళిత బంధు విషయంలో తనపై అనేక ఆరోపణలు వస్తున్నాయని
తనకు తెలియకుండానే వెంకటాపురం మండల కేంద్రంలో పంచమని తాను పంపించిన డబ్బులను సైతం దళిత బిడ్డలకు అందకుండా మండల నాయకులే కాజేశారు అని స్పష్టం చేశారు. తను నివాసం ఉంటున్న ఇల్లును సైతం అమ్మి మండల కాంగ్రెస్ నాయకులకు ఎవరి డబ్బులు వారికి ఇవ్వమని కోట్లు చెల్లించాను అని వారన్నారు.
గట్టిగా మాట్లాడితే వెంకటాపురం మండలం వచ్చి నిరూపించుకుంటా అని వెల్లడించారు.
మండల నాయకులు చేసిన తప్పులు నా పైన వేస్తే సహించేది లేదు అని వారిపై నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉండగా మండల కాంగ్రెస్ నాయకులు మాత్రం తేజ న్యూస్ లో వార్త చూసి రాత్రికి రాత్రే కొంతమంది దళితులను ఇంటికి పిలిచి మరి పైకం చెల్లించి గుట్టు సప్పుడు కాకుండా పంపించినట్టుగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అంతటితో ఆగకుండా వారు చేసిన అక్రమ వసూలు మస్కబారేలా చిత్రీకరించడానికి వార్త రాసిన తేజ న్యూస్ పత్రిక విలేఖరి పై ఎలా పగ సాధించుకోవాలో పాలు పోక చేసిన తప్పుకు కక్కలేక మింగలేక దుస్సహసానికి ఒడిగట్టారు, ఏ పాపం తెలియని సూరవీడు ఇసుక ర్యాంప్ కమిటీ సభ్యులను తేజ న్యూస్ విలేకరిపై తప్పుడు కేసులు బనయించమంటూ ప్రోత్సహించారు అని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభం శుభం తెలియని సూరవీడు ఇసుక ర్యాంప్ కమిటీ సభ్యులు వారికి తెలియకుండానే కేసులు పెట్టారు అంటూ విశ్వసనీయ సమాచారం. అక్రమ వసూళ్లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు వారి తప్పులను కప్పు పుచ్చుకోవడం కోసం గిరిజనులను ఎందుకు వాడుతున్నారు అని గిరిజన సంఘాలు సైతం ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
వారు పెట్టిన కేసులు బూటకం అయితే.
సరైన ఆధారం లేకుంటే.
గిరిజన మహిళలు బలికావాలా అంటూ పలు సంఘాల నాయకులు సైతం కాంగ్రెస్ నాయకుల పై ఫైర్ అవుతున్నారు.
కాంగ్రెస్ నాయకులకు గిరిజనులు దళితులే దొరికారా కాంగ్రెస్ నాయకుల కులంలో ఎవరు దొరకలేదా బలి పశువు లాగా అంటూ దళిత సంఘాలు సైతం ఈ విషయంలో వారి వైఖరిని ఖండించారు.
ఏదిఏమైనాప్పటికీ చేసిన తప్పును ఒప్పుకొని దళితులకు క్షమాపణలు చెప్పి డబ్బులు తిరిగి చెల్లించేలా కాంగ్రెస్ హై కమాండ్ మండల నాయకుల పై దృష్టి సారించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని. తీసుకొని పక్షంలో ఎస్ టి ఎస్ సి కేసులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
తేజ న్యూస్ కథనంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య
RELATED ARTICLES