ఎన్టీఆర్ జిల్లా నందిగామ
చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ని గురుకుల పాఠశాల లో ఎనిమిదోవ తరగతి చదువుతున్న కస్తాలా అపర్ణ D/O కిషోర్ చందర్లపాడు గ్రామ నివాసి అయిన కస్తాల అపర్ణ ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8/9/2024 నుండి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న విద్యార్థిని. అధ్యాపకులకు తెలియజేయగా గురుకుల పాఠశాలలోని అధ్యాపకులు సొంత ప్రయత్నంగా టాబ్లెట్స్ తెప్పిచ్చి ఇచ్చి వైద్యం అందించినట్టు అక్కడ ఉన్న స్థానికులు తెలియజేశారు,
గత 12 రోజుల నుండి విద్యార్థిని ఆరోగ్యం బాగోకపోయినా అధ్యాపకులు పట్టించుకోకపోగా
రోజువారి తరగతులకు హాజరవుతున్నవిదర్థిని ని అధ్యాపకులు గమనించకుండా వారి పనిలో వారు ఉంటూ విద్యార్థిని ని నిర్లక్ష్యానికి గురిచేసి ఆరోగ్యం క్షీణించిన తరువాత ది 23/9/2024 సోమవారం ఉదయం నందిగామలోని దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రం (ప్రభుత్వ వైద్యశాల )కు అధ్యాపకులు తీసుకువచ్చి ఆరోగ్యం బాగోలేదు నీరసంగా ఉందని చెప్పి వైద్యశాలలో చేర్పించినారు, కనీసం ఇన్ని రోజులైనా అధ్యాపకులు తల్లిదండ్రులకి విద్యార్థిని ఆరోగ్యం బాగోలేదని తెలియ చేయలేదని తల్లిదండ్రులు స్థానికులు తెలియజేశారు, వైద్యశాలలోని డాక్టర్లని వివరణ అడగగా గురుకుల పాఠశాల నుండి విద్యార్థిని తీసుకొచ్చి ఆరోగ్యం క్షీణించింది వైద్యం అందించాలని తెలియజేయగా డాక్టర్లు విద్యార్థినికి తగు వైద్యం అందిస్తున్న సమయంలో సడన్గా ఆరోగ్యం క్షీణించి ఒక్కసారిగా విద్యార్థిని ఆరోగ్యం క్షీణించటం తీవ్రతరం అవటంతో డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు సిఫారసు చేయగా తీవ్రత ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల విద్యార్థిని అకాల మరణం చెందింది, దీనిపైన తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురై గురుకుల పాఠశాల అధ్యాపకుల పైన చాలా ఆగ్రహాన్ని చూపిస్తున్నారు, ఇంత నిర్లక్ష్యం వహించిన అధ్యాపకులను తక్షణమే విధులను తొలగించాలని విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు స్థానికులు నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో ఆందోళన చేస్తున్నారు,
నందిగామ : గురుకుల పాఠశ్యాల అధ్యాపకుల నిర్లక్ష్యం వలన విదర్థిని బలి అంటున్న తల్లితండ్రులు
RELATED ARTICLES