సత్యవేడు నియోజకవర్గ నాగలాపురం మండలం వెళ్ళురు హరిజనవాడ గ్రామంలో సుమారు 2 నుండి 3నెలలుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సక్రమంగా పనిచేయకపోవడంతో మేము అధికారులకు కూడా తెలియజేయడం జరిగినది తాత్కాలికంగా వచ్చి వైర్లు ఏదో చేస్తానని చేసి వెళ్ళిపోతున్నారు మరుసటి రోజు ఆ వైర్లు కాలిపోతూ ఉన్నది. ఓల్టేజ్ ఎక్కువ అవ్వడం వలన ఆ వైర్లు నిలవడం లేదు.అది పనిచేయకుండా పోతావుంది ఇంత ముందు జరిగిన గ్రామసభలో కూడా అర్జీ పెట్టడం జరిగినది సెక్రటరీ మేడం నేను రెడీ చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగినది అయినా ఇంతవరకు పట్టించుకునే పాపాన పోలేదు అక్కడ పసిపిల్లలు స్కూల్ ముగించుకొని వచ్చి అక్కడే ఆటలు ఆడుకుని ఉంటారు. ఆ వైర్లు తెగి పిల్లల పై పడుతుందని తల్లిదండ్రులు చానా భయపడుతున్నారు. ఆ వీధిలో ఉన్న వాళ్ళు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. గ్రామసభ మీటింగ్లో అర్జీ పెట్టిన కూడా దాన్ని పట్టించుకోకుండా విద్యుత్ అధికారులు. రాత్రిపూట నిద్ర లేకుండా బిక్కు బిక్కు మని గడుపుతున్న గ్రామ ప్రజలు రాత్రిపూట ఏ టైం లో ఏమవుతుందో.వైర్ కట్ అవుతుందో ఏమో అనే భయంతోజీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోకుండా పోతున్నారు.
విద్యుత్ తీగ ఎక్కడ తెగిపడుతుందో ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్న ప్రజలు
RELATED ARTICLES