Monday, December 23, 2024

టిఎస్ఎండిసి పెద్ద సారు ఎక్కడ పండినవ్ ? లారీ డ్రైవర్ల ఆవేదన మీకు కనబడటం లేదా?

టిఎస్ఎండిసి పెద్ద సారు ఎక్కడ పండినవ్.?

లారీ డ్రైవర్ల ఆవేదన మీకు కనబడటం లేదా?

రోజురోజుకు పెరుగుతున్న లారీ లోడింగ్ ధరల విషయంలో మీ మౌనం ఏమిటి?

లోడింగ్ కు 5000 రూపాయలు, తీసుకోవాలని చెప్పింది మీరేనా?

ఇసుక క్వారీ నిర్వాహకుల చేతిలో లారీ డ్రైవర్లు బలి కావాల్సిందేనా ?.

దీనికి ముగింపు ఎన్నడు సారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రామచంద్రపురం ఒంటి చింతగూడెం సురవీడు ఇసుక క్వారీల లో గత కొంతకాలంగా  అధికారుల పర్యవేక్షణ లోపంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా జోరుగా వారి దందా మూడు పువ్వులు వారు కాయలుగా కొనసాగుతుంది. పర్యవేక్షించాల్సిన అధికారులే వారి ముడుపులకు దాసోహం అయ్యారు అనేట్టుగా వారి విక్రయాలు అధికారులను సైతం వెక్కిరిస్తున్నట్టుగా విచ్చలవిడిగా తయారైంది. లారీ లోడింగ్ కు 5000, సీరియల్కు 200, జెసిబి ఇసుక తీసి లోడ్ చేయడానికి 500 లారీ డ్రైవర్లు ప్రశ్నిస్తే అదనంగా 200 రూపాయలు పెద్ద మొత్తాన్ని లారీ డ్రైవర్ల వద్ద దండుకుంటూ వారిపై పెను భారాన్ని మోపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇసుక సురులు  కొత్త వరవడికి తెర లేపారు, వెనక వచ్చిన లారీలు ముందు పెట్టాలంటే 3000 రూపాయలు చెల్లించాల్సిందేనట.
ఇవన్నీ జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తైనా ఈ క్వారీల వైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావినిస్తున్నాయి. అనీ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.ములుగు జిల్లాలో ఎక్కడలేని విధంగా   అధిక రేట్లతో లారీ డ్రైవర్లను నడ్డి విరుస్తున్న ఇసుక మాఫియా పై ఏ అధికారి కన్నెత్తైనా చూడకపోవడం గమనార్హం. న్యూస్ పేపర్లకే పరిమితమైన వారి బాధలు పట్టించుకునే అధికారి ములుగు జిల్లాలో ఉన్నారా.? ఎన్ని రోజులు ఈ దూపిడికి లారీ డ్రైవర్లు గులాములు అవ్వాలి?
గులాబీ పార్టీ పోయి ఏడాదిగా వస్తున్న  ప్రజా పాలనలో గులాబీ పరిమళం వెదజల్లుతుందా?  టిఎస్ఎండిసి ప్రోటోకాల్ లో ఇదొక భాగమేనా?
టిఎస్ఎండిసి అధికారులు ఇసుక ర్యాంపు నిర్వాకులు ఒక మాట మీదనే సదన్నమవుతున్నారా?
కంచ సేను మేసినట్టుగా అధికారులు పరోక్షంగా సాప కింద నీరులా ఇసుకసురులకు, తోడ్పాటున అందిస్తున్నారా. అని ఇలా అనేక వదంతులు ప్రజలలో, జరుగుతున్న అధిక దోపిడిపై  వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనాపటికి రామచంద్రాపురం,సురవీడు ఒంటి చింతగూడెం లో జరుగుతున్న ఇసుక దందా  లారీ డ్రైవర్ల పాలిట శాపంగా మారిందని అనీ చెప్పాలి, ఈ విషయంలో టిఎస్ఎండి సీపీఓ విఫలమైన కారణంగా జిల్లా కలెక్టర్ స్పందించి ఒంటి చింతగూడెం సురవీడు రాంపులలో జరిగే అన్యాయాలను అరికట్టి లారీ డ్రైవర్ల బతుకుల్లో వెలుగులు నింపాలని లారీ డ్రైవర్లు వేడుకుంటున్నారు. అంతేకాకుండా రామచంద్రాపురం సురవీడు ఒంటి చింతగూడెం రాంపులను తక్షణమే నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు సైతం పత్రిక ముఖంగా కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular