కీసర ఇసుక పాయింట్ వద్ద ఈ లారీని లోడ్ చేసిన ఇసుక దాదాపు ముప్పై టన్నులకు పైనే ఉంటుంది. కేవలం 20 టన్నులు మాత్రమే లోడ్ చేయవలసిన స్టాక్ పాయింట్ అధికారులు ఎలా ఇంత ఇసుకను లోడ్ చేయిస్తున్నారు. అంటే అధికారులకు అమ్యామ్యాలు అందుతున్నయనే విషయం అర్దం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పాయింట్ లో నుంచి ఇసుక పంపిణీ కొరకు ట్రాక్టర్ లకు ఐదు టన్నులు, లారీలకు 20 టన్నులు మాత్రమే లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ఏ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఎలక్ట్రానిక్ కాటాలను ఎర్పాటు చేయలేదు. దీంతో అధికారులకు, అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీసర ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఒక అధికార ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నందిగామ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ కీలక నాయకుడు ఇప్పటి వరకు సుమారు మూడు కోట్ల వెనకేసుకు న్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కీసర ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇటు అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ సుమారు రోజుకు పదిహేను లక్షల వరకు అవినీతికి పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నందిగామ: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు ఇసుక స్టాక్ పాయింట్ అధికారులు తూట్లు
RELATED ARTICLES