తెలుగు సినిమా వెండితెర ఇలవేల్పు, తెలుగు ప్రజల ఆపద్భాంధవుడు, క్రమశిక్షణకు, పట్టుదలకు, స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం, అభిమానుల ఆలయశిఖరం అన్నయ్య పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం అన్నయ్య అభిమానులందరికీ పర్వదినం. అన్నయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని నందిగామ నియోజకవర్గ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్నయ్య పేరు మీద జన్మదిన వారోత్సవాలను వివిధ సమాజ సేవా కార్యక్రమాల ద్వారా 16-08-2024 నుంచి 22-08-2024 వరకు నిర్వహించడం జరుగుతున్నది.
ఈ వారోత్సవాలలో భాగంగా ది 21/08/24 బుధవారం అనగా ఈరోజు న అన్నయ్య చిరంజీవి గారి పేరు కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో కొలువై ఉన్న 138 అడుగుల అభయ వీరాంజనేయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం. చిరంజీవి గారు నిత్యం ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని, భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకోవాలని, ఆయన రాబోవు చిత్రాలు ఘన విజయం సాధించాలని వీరాంజనేయ క్షేత్రంలో పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ అధ్యక్షులు పోలిశెట్టి వరుణ్, చిరంజీవి యువత సభ్యులు కామిశెట్టి వెంకటేశ్వర రావు, పూజారి రాజేష్, కొఠారు దేవేంద్ర, వనపర్తి పద్మారావు, పెద్దినీడి హరిబాబు, తోట మహేష్, కూసునూరి నరసింహ, గోగులోతు సాయి హేమంత్ పలువురు పాల్గొన్నారు…..
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవ వేడుకలు
RELATED ARTICLES