ఎస్సీ వర్గీకరణ సాధించిన అనంతరం తొలిసారి భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంద కృష్ణ మాదిగ
మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్ష సుప్రీం కోర్టు తీర్పు ద్వారా నెరవేరిన సంధర్బంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం పుట్టకముందు నుండే మాదిగలకు జరిగిన అన్యాయాన్ని తన గొంతు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన పెద్దలు, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని వారి స్వగృహంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సుదీర్ఘ కాల ఉద్యమానికి ఎంతో అండదండలు అందించినందుకు మాదిగ ప్రజలు వెంకయ్య నాయుడుని మరచిపోరని తెలిపారు.
ఈ సందర్భంగా శాలువా కప్పి,పుష్పగుచ్చం అందించి వెంకయ్య నాయుడుని సత్కరించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మడమ తిప్పకుండా పొరటం చేసి విజయం సాధించినందుకు మంద కృష్ణ మాదిగకి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసిన మంద కృష్ణ మాదిగ
RELATED ARTICLES