జగ్గయ్యపేట మండల పరిధిలోని గ్రామాలకి హెచ్చరిక
కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో జగ్గయ్యపేట ప్రాంతంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంగా ఉన్న గ్రామాలలో తాసిల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రావిరాల. ముక్తేశ్వరపురం. వేదాద్రి గ్రామాల ప్రాంతంలోని ఒడ్డు ప్రాంతాల వద్ద రెవెన్యూ సిబ్బందిని నియమించారు. అదేవిధంగా వేదాద్రి. ముక్తేశ్వరపురం గ్రామాల వద్ద పడవలను వేయకుండా నిలిపివేసి. ప్రజల రాకపోకలను కూడా నిషేధిస్తూ ప్రత్యేక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కృష్ణా నదికి తీవ్రమైన నీటి ప్రవాహం ఉన్నందున ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీఆర్వోలను ఆదేశించారు. పై గ్రామాల వద్ద పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు తాసిల్దార్ నాగరాజు తెలిపారు. వారితోపాటు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజకు అప్రమత్తంగా ఉండాలి : జగ్గయ్యపేట తాసిల్దార్ నాగరాజు
RELATED ARTICLES