ములుగు జిల్లా ఎటునాగారం మండలoలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రకృతి నుంచి ఉద్భవించే ప్రాణవాయువును కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి అనే నినాదంతోనీ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు పెంచే కార్యక్రమానీకీ శ్రీకారం చుట్టగా .ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ములుగు జిల్లా యంత్రాంగం మొక్కలు నాటడం లో నిమగ్నమయ్యారు. ఈ నేపద్యంలో వన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎటునాగారం డిగ్రీ కళాశాలలో వన మహోత్సవానీ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ రేణుక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల జీవరాశికి మూల కారణం అటవీ అని రోజురోజుకు అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అంటూ మొక్కలు నాటే కార్యక్రమంలో మమేకమైన విద్యార్థులకు అడవి వల్ల ఉపయోగాలు మరియు అడవి విశిష్టతను తెలిపారు. అంతేకాకుండా జీవ వాయువు సృష్టించే చెట్లు అంతరించిపోవడం మనిషి మనుగడకు అంత మంచిది కాదు అని మరోసారి గుర్తు చేశారు.ఇప్పటికే ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు మనం నిత్యం చూస్తూనే ఉన్నామని ఇంకా మున్ముందు చెట్లను నరికి వేస్తే ప్రకృతి వినాశనానికి మనిషే కారణం అవుతాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటూ మానవ మనుగడకు అడవులు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కళాశాల బృందం ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం వీలైన ప్రతి చోట విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల సైతం మొక్కలు నాటారు. పచ్చదనం వెదజల్లే విధంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని వారి బాధ్యతగా స్వీకరించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రేణుక, డాక్టర్ డి నవీన్, వెంకటయ్య, కివీస్ ఫాతిమా, సంపత్, వంశీ మున్ని తదితర ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
ములుగు జిల్లా :వన మహోత్సవ కార్యక్రమంలో మమేకమైన డిగ్రీ కళాశాల విద్యార్థులు
RELATED ARTICLES