జిల్లాస్థాయి U09 బాల బాలికల చదరంగం ఎంపిక పోటీలు ముగిసాయి
నారాయణ స్కూల్ విద్యార్థి మనీష్ రాష్ట్రస్థాయికి ఎంపిక… స్థానిక నంద్యాల జిల్లా శ్రీ సంకల్ప ఒలంపియాడ్ స్కూల్ నందు జరిగినటువంటి U09బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలు ముగిసాయని టోర్న
మెంట్ ఆర్గనైజర్ రామసుబ్బారెడ్డి తెలిపారు.బహుమతి ప్రధానోత్సవం లో ముఖ్య అతిథులుగా సంకల్ప స్కూల్ ప్రిన్సిపల్ దివ్య కౌశిక్,లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిజాముద్దీన్,లయన్స్ క్లబ్ సెక్రటరీ
శిరిగిరి రమేష్,లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సోమేశ్వర నాగరాజు,టోర్నమెంట్ డైరెక్టర్ రాజా రమేష్ చక్రవర్తి, డిప్యూటీ చీఫ్ ఆర్బీటర్ ఇమామ్ హుస్సేన్ పాల్గొన్నారు.
విజేతలు
U09 బాలురులు
1)మనవిత్ నాయక్
2) మనీష్
U09 బాలికలు
1)రిశ్విత బాయ్
2)లోక్షిత