తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ప్రథమ స్థానంలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీ డీ నుండి ఏలోకి మార్చాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు ముదిరాజులను బీసీడీ నుంచి ఏలకు మార్చాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీ ఏలకు మారుస్తామని ముదిరాజులపై అన్ని సౌకర్యాలు ఉండాలని అప్పటి గవర్నమెంటు జీవో పాస్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండంగా మాకు రిజర్వేషన్లు మారిపోతుండొచ్చని కొన్ని శక్తులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు 55% ఉన్నాయా ముదిరాజ్ సోదరులకు ధర్నాలు చేసిన అనుకూలమైన తీర్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న బీసీ ఏ పై ఎటు తెలుసలేకపోతున్నారని అన్నారు.అప్పటి కలెక్టర్ లు పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మాపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారని విమర్శించారు. ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి వెంటనే బీసీ డీ నుండి ముదిరాజులను ఏలోకి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా సమయం ఉంది.ఇప్పుడు కూడా మీరు ముదిరాజుల డిమాండ్లను ఎత్తకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల చేసి సుడిగుండంలా మారుస్తామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ లతోపాటు రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లో అత్యధికంగా ముదిరాజులకే ఆయా పార్టీలు బీఫాంలో అందించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ సోదరులకు 2011 ప్రస్తుత జనాభా ప్రకారం, జనగణన ప్రకారం చట్టసభల్లో అత్యధిక సీట్లు కేటాయించడంలో రాజకీయ పార్టీలు ముదిరాజులను అనుగదొక్కారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క మంత్రి పదవి కూడా ముదిరాజులకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఓసీలకు సైతం పేదవారనే సాకుతో 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలోనే ముదిరాజులను అన్ని రంగాలలో తొక్కివేయడం అణిచివేయడం చేతకాని తానానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సుప్రీంకోర్టులో సైతం కేసు వేసినా నేటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా తీర్పు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముదిరాజులను బిసి-డి నుండి ఏ లో మార్చే విధంగా కృషి చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముదిరాజులు తలుచుకుంటే 20 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచే సత్తా ఉందని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలలో ఎన్నికలకు ముందు ఆయన ముదిరాజులపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముదిరాజుల ఊసే ఎత్తని ఆయన ప్రత్యేక కార్పొరేషన్ తో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్ కేటాయించి 5000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుడి గుండంలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సంఖ్యాపారంగా చూసి అన్న రిజర్వేషన్ ఇవ్వాలని అలాగే మత్స్య కార్మికుల కూడా సంఖ్య పెరుగుతున్నందున సభ్యతలు కూడా పెంచాలని ముదిరాజ్ సోదరులకు ఎక్కడైతే ముదిరాజ్ సోదరులకు చేపలు పట్టే వీలు లేక సభ్యతలు కలిగి లేకపోవడంతో ఆ గ్రామానికి సభ్యతలు కల్పించాలి. ప్రభుత్వం లెక్కలకు తీసుకొని ఒక్క సభ్యత్వానికి విస్తీర్ణ ప్రకారం ప్రభుత్వం అప్పుడు రెండు ఎకరాలకు ఒక సభ్యత్వం ఉండే ఇప్పుడు ఒక్క ఎకరానికి సభ్యత్వం ఇవ్వడం వల్ల ప్రభుత్వం ముదిరాజ్ సోదరులకు జీవో నంబర్ 6 అమలు చేయాలని అన్నారు అన్నారు. చెరువులలో కుంటలలో కనీసం మాకు సభ్యత్వం కల్పించి మత్స్యకారులుగా సభ్యత్వం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తా లేదని ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా పై అభివృద్ధికై విధులు కేటాయించడంలో వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముదిరాజులను బిసిఏ లో చేర్చాలి -ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి కొరివి నరసింహులు
RELATED ARTICLES