మా వార్డులో సమస్యలు పరిష్కరించండి నర్సంపేట మున్సిపల్ సాధారణ సమావేశంలో
ఒకటో వార్డు కౌన్సిలర్ దేవోజి తిరుమల
నర్సంపేట టౌన్
నర్సంపేట మున్సిపల్ సాధారణ సమావేశంలో భాగంగా 1వ వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల మాట్లాడుతూ 1వ వార్డు లో పారిశుద్ధ్యం పడకేసిందని మరియు రోడ్ల పైన పిచ్చి మొక్కలు పెరిగి దోమలతో ప్రజలు వ్యాధుల పాలవుతున్నారని అన్నారు.
కుక్కల శ్రీను ఇంటి వద్ద గత సంవత్సరం ముందు
కల్వర్ట్ తీర్మానం అయి ఉంది.. అట్టి పనులు ఇంతవరకు కూడా చేయలేదని అడిషనల్ కలెక్టర్ ని మరియు కమీషనర్ & ఎఈ ని అడగడం జరిగింది..
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ముందు మురికి నీరు వచ్చి భక్తులకు మరియు బాటసారిలకు ఇబ్బందిగా ఉన్నది అని గత కొన్ని పరిణామాలు గా చెప్పిన పట్టించుకోని అధికారులను నిలదీయడం జరిగినది .
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ స్పందించి వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని కమిషనర్ & ఎఈ కి చెప్పడం జరిగింది … త్వరలో పని కానీ పక్షంలో మా దృష్టికి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ తెలియచేయడం జరిగింది.
మున్సిపల్ తీర్మానంలో వచ్చి రాని బిల్లులు పెట్టడం జరిగింది అని బి ఆర్ఎస్ కౌన్సిలర్స్ వాటి అన్నింటినీ ఆమోదించకుండా & పరిశుద్ధ కార్మికుల వేతనాలు, పేపర్ బిల్లులు, మరియు ద్వారకపేట ఫిల్టర్ బెడ్ పక్కన నూతన సబ్ స్టేషన్ నిర్మాణం స్థలం కోసమై అనుమతుల పైన మాత్రమే ఆమోదించడం జరిగింది.
మున్సిపల్ లో తీర్మానం అయ్యి నిధులు టెండర్ అయ్యి ఉన్న పనులు దసరా లోపే పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ని మరియు మున్సిపల్ కమిషనర్ ని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు కోరానని కౌన్సిలర్ తెలిపారు