తేజ న్యూస్ టీవీ :మైనర్ వాల్మీకి చిన్నారి వాసంతి” ఆత్మకు శాంతి చేకూర్చాలని “ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS)” ఆధ్వర్యంలో
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మైనర్ చిన్నారి “వాల్మీకి వాసంతి” కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ
ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు వాల్మీకి చిన్నారి వాసంతి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తులతో 05 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మసాఅల్లా గ్రూప్ సభ్యులు మైనార్టీ నాయకులు మాదసి మాదరి కురువ నాయకులు మద్దతు తెలపడం జరిగింది.
చిన్నారి వాల్మీకి వాసంతిని అత్యాచారం చేసి చంపిన నిందితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కుల మతలకు అతీతంగా వివిధ గ్రామాల నుండి తదితరులు పాల్గొన్నారు.