నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMU) డాక్టర్ల బృందం శుక్రవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వారి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ల బృందం అంతా అఖిలప్రియను కలిసి అభినందనలు తెలిపారు.
డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరసింహారెడ్డి తో పాటు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ గణపతి రావు, డాక్టర్ చంద్రిక , డాక్టర్ కేశవరెడ్డి తదితరులు ఎమ్మెల్యే అఖిలప్రియ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలో డాక్టర్స్ అసోసియేషన్ వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే అఖిలప్రియను కలిసిన వైద్యుల బృందం
RELATED ARTICLES