TEJA NEWS TV : శిరివెళ్ళ మండలం పచ్చర్ల గ్రామంలో చిరుత పులి దాడిలో చనిపోయిన షేక్ మెహరీన్ బికుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఎక్సిగేసి చెల్లించి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సిపిఎం నాయకులు టి .రామచంద్రుడు, మరియు వి. బాల వెంకట్ గార్లు ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పచ్చర్ల గ్రామం లోని ప్రజలందరూ మూడు రోజుల నుండి భయాందోళనలతో జీవిస్తున్నారని, చాలా కుటుంబాలు ఇల్లు వదిలి, ఊరు వదిలిపెట్టి వెళ్లే పరిస్థితి ఏర్పడింది అని అందుకు ప్రధాన కారణం చిరుత పులులు దట్టమైన అడవి ప్రాంతాన్ని వదిలిపెట్టి గ్రామానికి సమీపంలో సంచరించడం, పచ్చర్ల, సర్వ నరసింహస్వామి దేవాలయం, ఆంజనేయ కొట్టాల, మహానంది తదితర అటవీ సమీప ప్రాంతాల్లోని పంట పొలాల్లో కూడా ఈ మధ్యకాలంలో చిరుత పులుల, ఎలుగుబండ్ల సంచారం తీవ్రంగా పేరిగిపోయింది అన్నారు. అందువల్ల అడవి సమీప్రాంత గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాలంటే కూడా చాలా భయపడుతున్నారు. రైతులు తమ పొలాలు చూసుకోవడానికి కూడా ఒంటరిగా అంతేకాకుండా గాజులపల్లి నుండి గిద్దలూరు కు ప్రయాణించడానికి కూడా వాహనదారులు భయపడు చున్నారు.కావున అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ప్రత్యేక ఆపరేషన్ జరిపి చిరుతపులులను పట్టుకొని ప్రజానీకానికి సుదూర ప్రాంతాల్లో, దట్టమైన అడవిలో ఉండే విధంగా చిరుతలను తరలించాలని, తద్వారా ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టాలని వారు కోరారు.
చిరుత పులుల దాడి నుండి ప్రజలకు రక్షణ కల్పించండి – సిపిఎం డిమాండ్
RELATED ARTICLES