TEJA NEWS TV: కొరివి నీరజ నర్సింలు ఆధ్వర్యంలో బిజెపిలో వెయ్యి మంది చేరిక.లు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు.
రమణారెడ్డికి బిబిపేటలో ముదిరాజ్ యువగర్జన ఆధ్వర్యంలో ఘన స్వాగతం
కామారెడ్డి ప్రతినిధి: మే 5
బీబీపేట మండల కేంద్రంలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముదిరాజ్ గర్జన మహాసభలో 1000 మంది గ్రామస్తులు బిజెపి పార్టీలో చేరారు. ఒక్కొక్కరికి బిజెపి కండువా వేసి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి వారిని అభినందించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాబోయేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాని ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. 400కు పైగా సీట్లను బిజెపి ప్రభుత్వం సాధిస్తుందని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశం రూపురేఖలే మారుస్తుందని, ప్రపంచంలోనే భారత్కు ప్రత్యేక స్థానం లభిస్తుందని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రోజుకు చేరికలు జోరుగా జరుగుతాయని అన్నారు. కొరివి నరసింహులు నీరజాలు ఎంపీటీసీ అయినటువంటి అయినటువంటి వీరు మొట్టమొదటిసారిగా దేవి పేటలో పార్టీలో చేరడం పై, వారిని అభినందించారు. ప్రతి పదిమందిలో 8 ఓట్లు బిజెపికే పడేవిధంగా కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని ఆయన సూచించారు. కొరివి నీరజ నర్సింలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నిజ్జనబాలయ్య,,బాలయ్య
,,నర్సింలు.శ్రీను,రాజు,పోచయ్య, దుర్గయ్య. చింతకింది
నాగరాజు లు పాల్గొన్నారు.
కామారెడ్డి : వెయ్యి మందితో బీజేపీలో చేరిన కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES