తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం లోహిత గ్రామంలో చెరువు మట్టి జెసిబి దళారులు రోజు రోజుకు మితిమీరు తున్నారు ఇది ఎందుకు తీస్తున్నారు అని అడిగితే మా ఇష్టం అని నీవు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో అంటూ సవాల్ చేస్తున్నారు, అదిగాకుండా అక్రమంగా ఎక్కడా ప్రభుత్వ భూములు కానీ గుట్టల లో చెరువులలో భయంకరమైన తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి లోతైన తవ్వకాలు జరపడం వల్ల వర్షాలు పడి ఎక్కడా లోతైన గుంతలు వున్నదో తెలియక గతంలో చెరువులో ప్రమాదవశాత్తు పడి మనుషులు అలాగే మూగ జీవులు సైతం చనిపోయిన రోజులు వున్నాయి, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న దీనికి నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఇకనైనా ఎస్సారెస్పీ, మైనింగ్, ఇరిగేషన్, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రజలు తెలిపారు ,
సంగెం: చెరువు మట్టి మాయం చేస్తున్న జెసిబి దళారులు
RELATED ARTICLES