Wednesday, February 5, 2025

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి -మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం


లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పార్టీ అభ్యర్థిని ఎవరిని సూచించిన  గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు కృషిచేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సోమవారం హనుమకొండలోని వారి నివాసంలో సంగెం మండలంలోని అన్ని గ్రామాల నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ..
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ సెగ్మెంట్లో పార్టీ ఎవరిని సూచించిన ఆ అభ్యర్థి గెలుపుకు ప్రతికార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలి.
కార్యకర్తలు, నాయకులందరూ ఐక్యతతో కృషి చేసి కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన పనులు,
పార్టీకి నమ్మకద్రోహం చేసి పార్టీలు మారిన వారితో నష్టంలేదు.మల్లి పార్టీలోకి వారు వస్తానన్న తీసుకునే ప్రసక్తేలేదు.
నేనుపార్టీ మారేది లేదని స్పష్టంచేశారు.ఉద్యమ నాయకుడు,తెలంగాణరాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటా..
అధికారంలోకి వస్తే వందరోజుల్లో హామీలు అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ.. వంద రోజులు దాటినా హామీల అమలు ఎటుపాయె? లోక్‌సభ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతరు.
కాంగ్రెస్‌ వచ్చినప్పటినుంచి ఇటు రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి.
నేడు పదేండ్లు సీఎంగా కేసీఆర్‌ చేసిన కృషి అభినందించదగినదనే విషయాన్ని
ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గింది, వ్యతిరేకత మొదలైంది..లోక్ సభ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్.అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటతో గెలిపివ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
ఈ సమావేశంలో జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య,నాయకులు పులుగు సాగర్ రెడ్డి,ధొనికేల మల్లయ్య,ఉండీల రాజు,బొంపెల్లి దిలీప్ రావు,షాబోతు శ్రీనివాస్,గుగులోతు వీరమ్మ,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular